నెల్లూరు రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ పదవికి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని మంత్రి పొంగూరు నారాయణ రెడ్ క్రాస్ లో రాజకీయ కుట్రలు తరలి విమర్శించారు. రెడ్ క్రాస్ గురించి రాజకీయాలు చేసే వారు ఒక్క రూపాయి డొనేట్ చేశారా అంటూ ప్రశ్నించారు.