AP: ప్రధాని మోదీ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లోని సభాస్థలికి చేరుకుంటారు. సా.4.15 గంటలకు విశాఖకు చేరుకుంటారు. బహిరంగ సభ, శంకుస్థాపనలు ముగించుకుని రా.7.15 తిరుగు పయనమవుతారు.