నేపాల్, భూటాన్ దేశాల్లో తరుచూ భూకంపాలు రావడంపై భౌతికశాస్త్ర వేత్తలు అభిప్రాయం తెలిపారు. భారత భూఫలకం ప్రతి సంవత్సరం సుమారు 6 నుంచి 7 మీటర్ల పొడువు ఉత్తరం దిశగా కదులుతోంది. దీంతో హిమాలయాల ఎత్తు కూడా పెరుగుతోంది. భూ ఫలకాల్లో కదలికల వల్ల ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఈ దేశాల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయని అంటున్నారు. హిమాలయాల్లో ఏర్పడే భూకంప తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు.