టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నుడా చైర్మన్ గా నియమితులైన నేపథ్యంలో బీదాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మీ అందరి సహకారంతోనే రెండోసారి నుడా చైర్మన్ పదవి వరించిందని కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.