నెల్లూరు: గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద శనివారం నిర్వహించిన గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ రూరల్ రహదారుల మరమ్మత్తులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు.