ఇందుకూరుపేట ఎక్సైజ్ పరిధిలో 18 మద్యం షాపులను కేటాయించినట్లుగా గురువారం ఇందుకూరుపేట ఎక్సైజ్ సిఐ జీవి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట ఎక్సైజ్ పరిధిలో ఇందుకూరుపేట మండలానికి ఐదు షాపులు, తోటపల్లి గూడూరుకు 5 షాపులు, ముత్తుకూరుకు ఎనిమిది షాపులను మొత్తం 18 షాపులను కేటాయించామన్నారు. ఈ నెల 11న లాటరీ పద్ధతి ద్వారా షాపులను కేటాయిస్తామని తెలిపారు.