పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తినాలి

77చూసినవారు
పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తినాలి
ప్రతి విద్యార్థి పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తినాలని ఎస్ ఎస్ ఏ సి ఎం ఓ పెంచలయ్య అన్నారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలోని ఎన్ఎస్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనమును తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుందన్నారు. పాఠశాలలో భోజనం చేయకుండా విద్యార్థులు ఇంటి వద్ద నుంచి భోజనం తీసుకుని రావడం సబబు కాదన్నాడు.

సంబంధిత పోస్ట్