జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు భార్య స్టెల్లా రాజ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే డెలివరీకి ముందు జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను యాదమ్మ రాజు తన యూట్యూబ్ ఛానల్‌లో పంచుకున్నాడు. డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్తే ఉమ్మునీరు లేదని బిడ్డపై ఆశలు పెట్టుకోవద్దని వైద్యులు చెప్పారని పేర్కొన్నాడు. తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారని ఆ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే డెలివరీ చేశారని చెప్పుకొచ్చాడు.