ముత్తుకూరు మండలంలోని పోలం రాజు గుంట, బండ్ల పాలెం గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఈ ప్రక్రియ సోమవారం జరిగింది. ఈ మార్గంలో గతంలో ఆర్టిసి బస్సు రాకపోకలు నిలిపివేయడంతో టిడిపి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆయన ప్రభుత్వంతో మాట్లాడి ఆర్టీసీ బస్సును పునరుద్ధరణ చేయించారు.