కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన పాశవిక హత్యాచారంను నిరసిస్తూ మనుబోలులోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది మంగళవారం ఉదయం ర్యాలీ చేపట్టారు. డాక్టర్ గేయ పూజిత మాట్లాడుతూ సభ్యసమాజం తలదించు కునేలా మహిళా డాక్టర్ పై జరిగిన అమానుష దుర్చిర్యను తీవ్రంగా ఖండించారు. డ్యూటీలో వున్న మహిళా డాక్టర్ను అత్మచారం చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపడం దిగ్బ్రాంతి కరమైన చర్య అన్నారు.