మనుబోలు మండల కేంద్రంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరునికి సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చకులు గందళ్ళ శ్రీనివాసులు నిర్వహించారు. స్వామి వారికి క్షీర పంచామృత అభిషేకము రుద్రాభిషేకమును నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతమ్మ దంపతులు ఉభయకర్తలగా వ్యవహరించారు.