స్వర్ణభారత్ ట్రస్ట్ సేవారంగానికి స్ఫూర్తి దాయకమని భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు ఆలోచనలు మహోన్నతంగా ఉంటాయన్నారు.