వరికుంటపాడు మండలంలో ఒకప్పుడు వరి, బత్తాయి, మెట్ట పంటలు సాగు చేసే రైతులు ప్రస్తుతం బంతిపూల సాగుకు శ్రీకారం చుడుతున్నారు. శివారు గ్రామమైన బోగ్యం వారిపల్లికి చెందిన కొంతమంది రైతులు ఇటీవల బంతి పూలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. జాతీయ రహదారికి అనుకొని పొలాలు ఉండడంతో అటుగా వెళ్ళే ప్రజలు, ప్రయాణికులు కొనుగోలుకు పరుగులు తీస్తున్నారు. దీంతో కిలో రూ. 100-120 వరకు అమ్మి ఆదాయం సొంతం చేసుకుంటున్నారు.