What: దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు గ్రామంలో మల్లిఖార్జున అనే గ్రామ నివాసి ఇంటికి దగ్గరగా విద్యుత్ లైన్ ఉంది. మల్లిఖార్జున మాట్లాడుతూ గత ఐదేళ్ళుగా అధికారులకు తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలు పెద్దలు మేడపైకి వెళ్తుంటారని దగ్గరగా ఉన్న విద్యుత్ లైన్ వలన ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపాలని మల్లిఖార్జున కోరారు.