కలిగిరి: ఉదృతంగా వాగు ప్రవహించడంతో రాకపోకలు బంద్

77చూసినవారు
కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం- బట్టువారిపాలెం మధ్యలో ఉన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వాగు ఉగ్రరూపం దాల్చి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీని ద్వారా రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ తమ దుస్థితి మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వర్షాలు వచ్చినా ఇబ్బంది కలగకుండా భారీ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్