వింజమూరు మండల వ్యాప్తంగా మోస్తారు వర్షం

79చూసినవారు
నెల్లూరు జిల్లా వింజమూరు మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి 7. 30 గంటల సమయంలో మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రి అయ్యేసరికి కారు మబ్బులను అలుముకొని వర్షం పడింది. కాగా గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ వర్షం పడకపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో ఇప్పటికే రాగులు, మినుములు, సజ్జలు, వరి నాట్లు వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్