నెల్లూరు జిల్లా సీతారాంపురం జాతీయ రహదారి నిర్మాణ పనులను ఆత్మకూరు ఆర్డీవో మధులత గురువారం పరిశీలించారు. నారాయణపేట వద్ద జరుగుతున్న రోడ్డు పనులను రెవెన్యూ అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు అధికారులకు ఆమె సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ బ్లాస్టింగ్ చేయనున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఆమెతో రెవెన్యూ అధికారులు ఉన్నారు.