ఉదయగిరి నుంచి అరుణాచలం కు ప్రత్యేక బస్సు

76చూసినవారు
ఉదయగిరి నుంచి అరుణాచలం కు ప్రత్యేక బస్సు
ఉదయగిరి నుంచి అరుణాచలం కు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 4వ తేదీన కార్తీక సోమవారం సందర్భంగా ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సర్వీస్ నవంబర్ 3న ఉదయం 8 గంటలకు ఉదయగిరి నుంచి బయలుదేరుతుందన్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. ఒక్కొక్కరికి రూ. 1650 గా టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్