ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా నిలుస్తానని ఎమ్మెల్యే హామీ

66చూసినవారు
నెల్లూరు జిల్లా జలదంకి మండలం రామవరప్పాడు గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎంతో సంక్షేమాన్ని చేసామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్