ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీలో మాట్లాడారు. పేదలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఉదయగిరి అని, కనీస మౌలిక వసతులకు నా నియోజకవర్గ ప్రజలు నోచుకోలేదని, నియోజకవర్గంలోని పేదలకు గత ప్రభుత్వం 7049 ఇళ్లకు అనుమతులు ఇస్తే 642 ఇళ్ళను మాత్రమే, అంటే కేవలం 9% పూర్తి చేశారని, వీటిలో ఆప్షన్ 3 ద్వారా 1616 ఇళ్ల నిర్మాణం కొరకు కాంట్రాక్టర్లకు అప్పగించగా కేవలం 26 ఇళ్ళను (1. 5%) మాత్రమే నిర్మించి ఇచ్చారని తెలిపారు.