ఉదయగిరి: పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

68చూసినవారు
ఉదయగిరి: పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
చిలకలమర్రి జడ్పీ హైస్కూల్‌లో శనివారం పదో తరగతి విద్యార్థులకు గణిత ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి మ్యాథమేటిక్స్ స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ మెటీరియల్ ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం రూపొందించింది. ఈ సందర్భంగా, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో ఈ మెటీరియల్ ఎంతో సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు రెడ్డి, కృష్ణారెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్