నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తుఫాన్ కారణంగా గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షాల కంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం తీవ్రత చాలా ఎక్కువగా కనిపించింది. మండలంలోని ఊటుకూరు గ్రామంలో వాగులు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం కారణంగా పంట నష్టం జరిగిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 1-2 గంటల వ్యవధిలోనే ఇంత భారీ వర్షం పడడంతో వింజమూరు పరిసర ప్రాంత ప్రజలు అల్లాడిపోయారు.