ఆహార తయారీలో నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్ హెచ్చరించారు. అనంతపురంలోని జీజీహెచ్ ఆసుపత్రిలోని క్యాంటీన్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. క్యాంటీన్ పై పలు ఫిర్యాదులు రావడంతో పుల్కా, పెరుగు నమూనాలను సేకరించారు. రోగులకు అందించే ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండాలని వంట గదిలో శుభ్రత పాటించాలని చెప్పారు.