అనంతపురం పట్టణంలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ కరపత్రాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శి రాంకుమార్ మాట్లాడుతూ ఈనెల 3న అనంతపురం ఎన్జీవో హోం నందు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజా సంఘాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రొఫెసర్ సాయిబాబా అనేక పత్రికల్లో తన రచనల ద్వారా పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని తెలిపారు.