రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆగిపోయిన హంద్రీనీవా కాలువ పనులు తిరిగి చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్. అండ్. బి అతిథి గృహంలో హంద్రీనీవా కాలువ పనులపై హెచ్. ఎన్. ఎస్. ఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.