నాణేలు తీసుకొని వారిపై చర్యలు తప్పవు: కలెక్టర్

51చూసినవారు
నాణేలు తీసుకొని వారిపై చర్యలు తప్పవు: కలెక్టర్
భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన, చెలామణిలో ఉన్న నాణేలను స్వీకరించేందుకు విముఖత చూపరాదని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం తెలిపారు. వ్యాపారులు, దుకాణదారులు 1, 2, 5, 10 రూపాయల నాణేలను అందరూ తీసుకోవాలన్నారు. నాణేలను తీసుకోని వారిపై చర్యలు తప్పవన్నారు. బ్యాంకుల్లో నాణేలను మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ జనవరి 14, 2019 నాటికి ప్రత్యేకంగా బ్యాంకులకు సూచనలు ఇచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్