అనంతపురంలోని కమలానగర్ లో గల షెల్టర్ హోమ్ ను మంగళవారం అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శివప్రసాద్ యాదవ్ సందర్శించారు. అనంతరం షెల్టర్ హోమ్లో ఉన్న వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. వారికి న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సమస్య కు సంప్రదించవచ్చునని సూచించారు.