ధర్మవరంలో తయారు అయ్యే చేనేత వస్త్రాలపై జీఎస్ టి రద్దు చేయాలని చేనేత కళాకారుడు జుజూరు నాగరాజు గవర్నర్ ను గురువారం కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆహ్వానం మెరకు విజయవాడలో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ కు చేనేతలు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు.