రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదివారం ధర్మవరంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మంత్రి వివేకానందుడి పుట్టినది ఎప్పుడు అని అడగ్గా సమాధానం ఇచ్చిన విద్యార్థులు, చనిపోయిన రోజు అడిగితే చెప్పలేకపోయారు. అప్పుడు మంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పేరు, నిన్న రిలీజ్ అయిన రామ్ చరణ్ సినిమా ఏది అని అడిగ్గా విద్యార్థులు టక్కున సమాధానం చెప్పారు.