ధర్మవరంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. పోటీల్లో దాదాపు 480 మంది మహిళలు పాల్గొనడం చాల సంతోషం అన్నారు. మహిళలు వేసిన ముగ్గులు సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా ఉన్నాయన్నారు. అందులో మొదటి బహుమతి సాయి సుష్మకు రూ. 25 వేలు, రెండవ బహుమతి స్వాతిస్వాతికి రూ. 15 వేలు, మూడో బహుమతి ప్రసన్న లక్ష్మికి రూ. 10 వేల నగదు బహుమతిని అందజేశారు.