ధర్మవరం పట్టణంలో చేనేతల ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి అమ్మవారిని మంత్రి సత్య కుమార్ యాదవ్, టిడిపి పరిటాల శ్రీరామ్ దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జ్యోతుల మహోత్సవ కార్యక్రమానికి ముందు అమ్మవారికి పట్టు వస్త్రాలను నాయకులు సమర్పించారు. ఆలయ కమిటీ నాయకులు మంత్రి సత్య కుమార్ కు పరిటాల శ్రీరామ్ ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయించారు.