ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్ వంతెన కింద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు రెండవ పట్టణ పోలీసులను సంప్రదించాలని కోరారు.