గుత్తి మండల పరిధిలోని జక్కలచెరువు గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి ఆవాస యోజన వారోత్సవాల్లో హాజరయ్యారు. జక్కలచెరువు ప్రజలందరూ ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణ, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.