గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు గ్రామ చెరువు నీటితో కళకళలాడుతుంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వర్షపు వరదనీరు చెరువులోకి చేరాయి. మరోపక్క హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలను చెరువులకు విడుదల చేయడంతో పాత కొత్తచెరువు సుమారు 70 శాతం వరకు నీటితో కళకళలాడుతుంది. చెరువు కింద పంటలు సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేశారు.