కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేసి అంబేద్కర్ కి క్షమాపణ చెప్తేనే గాని భారతదేశ ప్రజలు క్షమించరని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ బి. కదిరప్ప పేర్కొన్నారు. గురువారం కదిరి పట్టణంలోని కార్యాలయంలో అయన మాట్లాడుతూ బిజెపి పార్టీ వారు వెంటనే అమిత్ షాను రాజీనామా చేయించాలని లేకపోతే భారతదేశమంతా నిరసన కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ని అవమానించేలా మాట్లాడారన్నారు.