కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం వ్యవసాయాధికారి జాఫర్ ఆధ్వర్యంలో రైతులకు ఉలవలు పంపిణీ చేశారు. వైపరీత్యాల కారణంగా ఖరీప్ సీజన్ లో వేరుశెనగ విత్తనం విత్తని రైతులు ఉలవలను విత్తుకుని మంచి దిగుబడిని సాధించుకోవాలన్నారు. మేకలు, గొర్రెలు, పశువులు ఉన్న రైతులకు ఉలవ పంట ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన గ్రామ రైతులకు సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఆ గ్రామ టిడిపి నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.