విజయనగరంలో నవంబర్ 27వ తేది నుంచి జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహా సభలు జయప్రదం చేయాలని అనంతపురం జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు హనుమంతరాయుడు పిలుపునిచ్చారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. విద్యార్థి సంఘం ఏర్పడినప్పటి నుంచి సమస్యల కోసం రాజీలేని పోరాటం చేశామని తెలిపారు.