మానిరేవు: వివాదంగా ఉన్న చర్చి స్థల సమస్య పరిష్కారం

76చూసినవారు
మానిరేవు: వివాదంగా ఉన్న చర్చి స్థల సమస్య పరిష్కారం
కళ్యాణదుర్గం మండలం మానిరేవులో దీర్ఘకాలంగా రెండు వర్గాల మధ్య చర్చి స్థల విషయంపై వివాదం ఉంది. తరచూ చర్చి స్థల విషయంపై ఇరువర్గాలు ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహణలో భాగంగా తహశీల్దార్ మానిరేవు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఇరు వర్గాలతో చర్చించి, చర్చి స్థల సమస్యను పరిష్కరించారు. దీంతో ఇరువర్గాలు తహశీల్దార్ కు, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్