అనంతపురం పట్టణంలో దళిత నేతశంకర్ నివాసం వద్ద మంగళవారం మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన మడకశిర శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ & మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్ రాజు, సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, దళిత సంఘాల నాయకులు, మాదిగ సోదరులు తదితరులు పాల్గొన్నారు.