గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలో మడకశిర మాల మహానాడు తాలూకా అధ్యక్షులు బిఆర్ పాండురంగమూర్తి అధ్యక్షతన ఆదివారం వనికే ఓబవ్వా మూడవ జయంతి ఉత్సవం జరుపుటకు ఐదు మండలాల మాల కులస్తులందరూ చర్చించి ఏకగ్రీవముగా ఉత్సవం జరుపుటకు తీర్మానించారు. వచ్చే నెల 19 ఆదివారము నాడు జరుపుటకు నిశ్చయించినారు. తాలూకా కమిటీ 5 మండలాల కమిటీల సభ్యులు, మాల కుటుంబ సభ్యులు హాజరైనట్లు మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి తెలిపారు