పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి, ఎమ్మెల్యే సవిత శుక్రవారం పర్యటించారు. రెవెన్యూ గ్రామ సదస్సులో భాగంగా మంత్రి సవిత మునిమడుగు గ్రామానికి శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితకు గ్రామస్థులు, మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ చిన్న వెంకట రాముడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.