సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ స్వర్ణాంధ్రగా ఆవిర్భవిస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి సవిత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబు ఒకవైపు సంక్షేమం అమలు చేస్తూనే మరోవైపు సంపద సృష్టికి అనేక పరిశ్రమలను తీసుకొస్తున్నారన్నారు.