
సీఎం రిలీజ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే
పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 13 మందికి రూ. 11, 66, 456ల విలువ గల చెక్కులను బాధితులకు అందజేశారు.