ప్రజలకు కల్తీ లేని సచ్ఛమైన పాలను అందించాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి డైరీ నిర్వాహకులకు సూచించారు. అనంతపురం రుద్రంపేట లో గురువారం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో గాయత్రి పాల డైరీ ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. డైరీలో పాల పదార్థాలు , స్వీట్స్ , పెరుగు, లస్సీ , పన్నీర్ను ఎమ్మెల్యే పల్లె సింధూర పరిశీలించారు.