రాప్తాడు ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించినట్లు తోటి ఉపాధ్యాయులు గురువారం తెలిపారు. సూర్యనారాయణ అనారోగ్యంతో 25 రోజులుగా బెంగళూరులో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. సూర్య నారాయణ గౌడ్ జిల్లా, రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా పని చేశారన్నారు. ఆయన మృతికి పాఠశాలలో హెచ్ఎం సాంబశివ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.