రోడ్డు నిబంధనలు ప్రతి వాహనదారుడు పాటించాలి: సీఐ

55చూసినవారు
రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని రాయదుర్గం సిఐ జయానాయక్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. మంగళవారం రాయదుర్గం పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనాలకు సంబంధించిన రికార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అధిక లోడుతో వాహనాలను నడపకూడదన్నారు. అతివేగంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నారు.

సంబంధిత పోస్ట్