బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారిణి స్వాతిలక్ష్మీ వారికి రక్తపరీక్ష, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గర్భవతులు మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.