శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం రోడ్డు ప్రమాదంలో 8మంది కూలీలు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైనదని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులు బాధితులకు అండగా నిలిచి, వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.