గార్లదిన్నె మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ గా విజయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో అనంతపురం సిటీ మీటర్ విభాగం నుంచి ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలు అందిస్తానని తెలిపారు.