యాడికి మండల కేంద్రంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రం నుంచి కోనకు వెళ్లే రోడ్డులో ఆంజనేయస్వామి దేవస్థానం ముందర పాడి పశువులకు ట్రాక్టర్లు జొన్న పంట గడలు తీసుకెళుతున్న సందర్భంలో విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ట్రాక్టర్ ట్రాలీలో పశువుల దాణాను క్రిందికి దించేశాడు. అయితే వెనుకల ఈ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.